WGL: నల్లబెల్లి(M) కన్నారావుపేట గ్రామసభలో BRS సర్పంచ్ పలనాటి మూర్తి ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులకు మాత్రమే అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారని, ఇతర పార్టీలకు చెందిన సర్పంచులకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టినట్లు తెలిపారు.