VKB: అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వికారాబాద్ జిల్లా CPI జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మీ పండిట్స్ అభిప్రాయపడ్డారు. గురువారం తాండూరు పట్టణంలో జరిగిన CPI జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న విధానాల వల్లనే ప్రపంచం మొత్తం అశాంతి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.