నటి సోనాలి బింద్రే, ఆమె భర్త గోల్డీ బెల్పై పూణేలో భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. తనకు సంబంధించిన 30 గుంటల భూమిని అక్రమంగా దక్కించుకున్నారని ఓ రైతు కోర్టుకెక్కారు. అయితే, సోనాలి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తన పేరు ఏ పత్రాల్లోనూ లేదని, కేవలం డబ్బు కోసమే తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.