TG: హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్రకు 3 వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.