నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, JK మాజీ CM ఫరూక్ అబ్దుల్లాపై ఓ వివాహ వేడుకలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తొలిసారిగా స్పందించిన ఆయన.. ‘దేవుడే కాపాడాడు. బాగానే ఉన్నా’ అని తెలిపారు. చివరి క్షణంలో సెక్యూరిటీ సిబ్బంది తనను రక్షించి, వెంటనే కారులో అక్కడి నుంచి తీసుకెళ్లారని పేర్కొన్నారు. కాగా నిందితుడు కమల్ సింగ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.