AP: కాకినాడ జిల్లా దారపల్లి శివాలయం సమీపంలో పులి గాండ్రింపులు కలకలం రేపాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం దారపల్లి, తాడ్వాయి గ్రామాల మధ్య దట్టమైన అడవిలో పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. శంఖవరం, ప్రత్తిపాడు మండలాల సరిహద్దు కొండ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నాయని, రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.