AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. చికిత్స పొందుతూ స్వరూప్ నగర్‌కు చెందిన బండారు వీరలక్ష్మీ(60) మృతి చెందారు. కాగా వీరంతా కల్తీ పాలు తాగడం వల్ల కిడ్నీతో పాటు ఇతర శరీర భాగాలు దెబ్బతిని చనిపోతున్న సంగతి తెలిసిందే.