MLG: మల్లూరు హేమాచల లక్ష్మీనృసింహాస్వామి దేవస్థానంలో పరిచారిక పోస్టు కోసం తప్పుడు కుల సమాచారం ఇచ్చి దరఖాస్తు చేసిన అర్చకులపై చర్యలు తీసుకోనున్నట్లు తహశీల్దార్ రవీందర్ తెలిపారు. బ్రాహ్మణులకు చెందిన నలుగురు శ్రీవైష్ణవులమని పేర్కొంటూ సర్టిఫికెట్ పొందినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.