MBNR: జిల్లాలోని 108, 102 అంబులెన్సులలో డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కో-ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు. డ్రైవర్ పోస్టుకు టెన్త్ పాసై, 35 సం.ల లోపు ఉండాలన్నారు. లైసెన్స్, 3 సం.ల అనుభవం, బ్యాడ్జి నంబర్ కలిగి ఉండాలన్నారు. టెక్నీషియన్‌కు డిగ్రీలో బీజెడ్సీ చదివి ఉండాలన్నారు. 108 ఆఫీస్‌లో రేపు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.
Tags :