RR: పన్నుల వసూళ్లలో చేవెళ్ల మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటింది. 92.20 శాతం వసూళ్లతో జిల్లాలో టాప్లో నిలవడమే కాకుండా, రాష్ట్రస్థాయిలో 5వ స్థానాన్ని దక్కించుకొంది. అధికారుల ప్రత్యేక డ్రైవ్లు, ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించడంతో ఈ ఘనత సాధ్యమైంది. వంద శాతం లక్ష్యం దిశగా మున్సిపాలిటీ వేగంగా అడుగులు వేస్తోంది.