ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నగరంలో అమర్చిన 1.4 లక్షల సీసీ కెమెరాలను తొలగించనుంది. ఇవన్నీ చైనాలో తయారైన కెమెరాలే. వీటి స్థానంలో కొత్తవి భర్తీ చేయనున్నారు. ఆప్ ప్రభుత్వంలో ఫేజ్-1 కింద 2020 నుంచి 2022 మధ్య ఈ సీసీ కెమెరాలను నెలకొల్పారు. ఢిల్లీలో మొత్తం 2.7 లక్షల సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి.