CTR: యువగళం పాదయాత్రలో వడ్డెర కులస్తులకు లోకేశ్ ఇచ్చిన హామీను ప్రభుత్వం నిలబెట్టుకుందని AP వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మల్లె ఈశ్వరరావు పేర్కొన్నారు. గుడిపల్లి మండలం కంచి బందార్లపల్లి, శాంతిపురం మండలం తిమ్మరాజు పల్లి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి NTR భరోసా పెన్షన్లను అందజేశారు.