ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మరణానికి సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని సింగపూర్ పోలీసు ఫోర్స్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. జుబీన్ గార్గ్ మరణంలో ఎటువంటి కుట్ర లేదా అనుమానాస్పద అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.