AP: ప్రభుత్వం ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఆయా శాఖలవారీగా ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. రేపు అన్ని విభాగాధిపతులతో భేటీ నిర్వహించనుంది. ఆ తర్వాత ఖాళీలపై తుది జాబితాను రూపొందించనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.