AP: విశాఖలో క్యాప్ జెమినీ సంస్థ ఏర్పాటుపై ఆ సంస్థ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఇప్పటికే మధురవాడ ఐటీ పార్కులో హిల్-1పై 20 ఎకరాలు పరిశీలించినట్లు లోకేష్ పేర్కొన్నారు. అలాగే, అడివివరం, ఆనందపురం పరిధిలో రెండుచోట్ల భూములను సంస్థ ప్రతినిధులు పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం ఉదయం 11:15కు విశాఖ నుంచి లోకేష్ తిరుగుపయనం కానున్నారు.