AP: కలెక్టర్లు, మంత్రుల ఆలోచన ధోరణి మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. సమస్యలతో వచ్చిన వారిని వెయిట్ చేయించొద్దని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సూచించారు. సంప్రాదాయ వ్యవసాయంతో పాటు పరిశ్రమలను కూడా ప్రోత్సహించాలన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించే కలెక్టర్ల ర్యాంకింగ్స్, పనితీరును కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. పారదర్శకంగా వ్యవహరించాలని, అవినీతిని సహించే ప్రసక్తే లేదన్నారు.