పార్వతీపురం ITDA పరిధిలోని 351 మంది గిరిజన మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 175.50 లక్షల ఆర్ధిక సహాయంతో జీవనోపాధి కార్యక్రమాలను అమలుచేయనున్నట్లు ITDA PO సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్టీ మహిళా అభ్యర్ధులకు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్టు ట్రైబల్ సబ్ స్కీమ్ క్రింద లబ్దిదారులకు ప్రోత్సాహకం అమలు చెయ్యునున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.