KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 27న ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొంటారు.