ప్రతిపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో.. సభలో మాట్లాడేందుకు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, సభా నియమాలకు కట్టుబడే పనిచేస్తున్నామన్నారు. స్పీకర్ పదవి ఏ ఒక్కరికో సొంతం కాదని, పార్లమెంటు 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.