TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు GHMC శుభవార్త చెప్పింది. 2025-26 ఏడాదికి గాను పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. చెల్లింపుదారులు GHMC అధికార సైట్, MyCURE యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లలో బకాయిలు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.