TG: రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వసాధారణం అయిపోయాయి. ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఒక సంప్రదాయంగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలకు ప్రాముఖ్యత ఉండేది. కానీ ఇప్పుడు ‘అధికారమే పరమావధి’గా మారింది. MLAలు పార్టీలు మారడం అంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లడం కాదు, అది ప్రజల నమ్మకాన్ని అమ్ముకోవడమే. దీనిపై చట్టంలో కఠిన మార్పులు తేవాలి.