బాపట్ల మండలంలోని వెదులపల్లి గ్రామం సమీపంలోని హైవే రోడ్డుపై ట్రాక్టర్ అతివేగంగా రావడంతో గడ్డివాము సైడుకి పడిపోయింది. దీంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ చిన్నపాటి ప్రమాదం గురువారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.