చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ఐకూ దేశీయ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఐకూ Z11కు కొనసాగింపుగా iQOO Z11x 5G పేరిట విడుదల చేసింది. ఐకూ Z11x 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 6GB+128GB ధర రూ.18,999, 8GB+128GB వేరియంట్ ధర రూ.20,999, 8GB+256GB వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది.