VZM: మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి. బాలమణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మిషన్ శక్తి’ పథకంపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. స్థానిక మహారాజా డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన 20 రోజుల అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన మిషన్ శక్తి, మిషన్ వత్సల్య, పోషణ అభియాన్ వంటి పథకాల గురించి వివరించారు.