KMR: కోటగిరిలోని కొత్తపల్లి గ్రామంలో పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ శనివారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని వారు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు.