PDPL: విద్యుత్ శాఖలో ఈ-స్టోర్ విధానం అమలుతో పనులు వేగవంతమవుతున్నాయని సూపరింటెండెంట్ ఇంజినీర్ గంగాధర్ తెలిపారు. అవసరమైన విద్యుత్ సామగ్రిని ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకుని వెంటనే వినియోగించుకునే సౌకర్యం కల్పించడంతో క్షేత్రస్థాయిలో పనులు సులభతరమయ్యాయని, ట్రాన్స్ ఫార్మర్ మార్పులు, లైన్ మరమ్మతులు త్వరగా పూర్తై వినియోగదారులు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు.