సిరిసిల్ల జిల్లాలోని నూతనంగా ఎన్నికైన 33 వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్‌లు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ’99 రోజుల కార్యచరణ ప్రణాళిక’ను ఇవాళ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి దిశగా పనులను కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా తమకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు ఇంఛార్జ్ అలేఖ్య, ఆర్పీలు హేమలత, సునీత, తదితరులు పాల్గొన్నారు.