TG: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈనెల 16 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రోజురోజుకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాఫ్ డే స్కూల్స్ పెట్టాలని నిర్ణయించింది.