ATP: పుట్లూరు మండలం కోమటికుంట్ల గాలిమరల కేంద్రంలో విధులు నిర్వహిస్తూ, గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన డి.అన్వర్ భాష కుటుంబానికి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి అండగా నిలిచారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మృతుడి భార్య డి.భానుకు రూ.4,55,000 ఆర్థిక సాయం వచ్చేలా చూశారు. ఆ చెక్కును గురువారం బాధిత మహిళకు ఎమ్మెల్యే అందజేశారు.