W.G: తాడేపల్లిగూడెం పుర దేవత శ్రీ బలుసులమ్మ జాతర మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు మంగళ ద్రవ్యాలు సమర్పించి ఉత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. జాతర తొలి రోజు అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన హోమశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు.