ELR: ఉంగుటూరు(M) చేబ్రోలు గ్రామపంచాయతీ ఇంఛార్జ్ అభివృద్ధి అధికారిగా బొడ్డు వెంకట రవిచంద్ర కుమార్‌ను నియమిస్తూ జిల్లా నుంచి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో మనోజ్ గురువారం తెలిపారు. ఈయన ఉంగుటూరు పంచాయతీ అభివృద్ధి అధికారిగా, గొల్లగూడెం పంచాయతీ ఇంఛార్జ్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ అధికారి శ్రీనివాసును రాజకీయ కారణాల వలన మరోచోటకు బదిలీ చేసారు.