SDPT: ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణపై జిల్లా కేంద్రంలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హైమావతి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లకు పథక అమలుపై దిశానిర్దేశం చేశారు.