AP: కూటమి ప్రభుత్వం చెప్పే మైనారిటీ సంక్షేమం అంతా బూటకమని APCC చీఫ్ షర్మిల అన్నారు. ‘చంద్రబాబు మోదీకి వణుకుతున్నారు. BJPకి గులాం గిరి చేస్తున్నారు. RSS భావజాలానికి అలవాటు పడ్డారు. మైనారిటీ సంక్షేమానికి నిధులిస్తే సంక్షేమం కట్ అవుతుందని భయపడుతున్నారు. CBNకి మైనారిటీల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పేదముస్తిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేయాలి’ అని డిమాండ్ చేశారు.