AP: నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ అక్కడ అత్యాధునిక సాంకేతికతతో కూడిన అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డును అభివృద్ధి చేయనుంది. నౌక నిర్మాణ రంగంలో కీలకంగా మారనున్న ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.