GDWL: బాల్య వివాహాల నిర్మూలన, అక్షరాస్యత పెంపు, ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. గురువారం గద్వాలలోని బృందావన్ గార్డెన్స్‌లో నూతన సర్పంచులు, కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణలో అయన అధ్యక్షత వహించారు. నిరంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారం అందేలా చూడాలనారు.