MBNR: గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని మేయర్ మమత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో నిర్వహించిన కార్పొరేటర్, కౌన్సిలర్, సర్పంచుల శిక్షణ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలోని నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు.