ప్రకాశం: కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల్లోని సమస్యలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.