KMM: కారేపల్లి మండలం గుట్ట కింద గుంపు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ కొండల తవ్వకాలను అడ్డుకోవడంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవీందర్ పూర్తిగా విఫలమయ్యారని BGBPS అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ధ్వజమెత్తారు. గురువారం కొత్తగూడెంలోని ప్రాంతీయ కార్యాలయంలో అధికారి రవీందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.