కోనసీమ: అయినవిల్లి మండలంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఎంపీడీవో సరోవర్ మండలంలోని గ్రామాల ప్రత్యేక అధికారుల లిస్టును విడుదల చేశారు. గ్రామ పంచాయతీల పరిపాలన వ్యవహారాలన్నీ ఈ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.