KDP: కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు జిల్లా రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇతని వయసు 55 ఉంటుందని, పింక్ కలర్ చొక్కా ధరించి ఉన్నాడని, ముస్లిం, దూదేకుల వ్యక్తిగా భావిస్తున్నారని తెలిపారు. గుర్తు పట్టిన వారు పోలీసులకు తెలపాలని కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.