NLR: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సమగ్రశిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య గురువారం తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో, 7 నుంచి పది, 12వ తరగతుల్లో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.