WNP: పానగల్ మండలం బావాజీపల్లిలో సర్పంచ్ సూగురమ్మ ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన 99 రోజుల’ గ్రామసభ నిర్వహించారు. వైద్యాధికారి డా. చంద్రశేఖర్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగర్, దంత, క్యాన్సర్ పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు అందించారు. గ్రామ అభివృద్ధితో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.