ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను షీ టీం సిబ్బంది రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. డిపో మేనేజర్ సమాచారంతో స్పందించిన పోలీసులు, ఆమె వివరాలు సేకరించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకుని హెచ్చరించారు. మహిళల భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటామన్నారు.