SGR: జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 18,911 మంది విద్యార్థులకు గాను 18,181 మంది (96.14%) హాజరయ్యారని, 730 మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశరన్నారు.