టీ20 ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’కు బుమ్రా పూర్తి అర్హుడని దిగ్గజ ప్లేయర్ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. తన వరకు అయితే సంజూ శాంసన్ కంటే కూడా బుమ్రాకు ఆ అవార్డు ఇవ్వాల్సిందని పేర్కొన్నాడు. ఈ టోర్నీ మొత్తం బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడని, ముఖ్యంగా సెమీస్, ఫైనల్స్లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేశాడన్నాడు. అతడు భారత క్రికెట్కు విలువైన ఆస్తి అని తెలిపాడు.