PLD: వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం పిడుగురాళ్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి మహేష్ రెడ్డి పాల్గొని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.