AP: TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కేంద్రంగా కుట్రలు చేస్తున్నారని జనసేన తిరుపతి నియోజకవర్గం ఇంఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ఆయన ఛైర్మన్గా ఉన్నప్పుడు వేల మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్నారని చెప్పారు. ‘పరకామణిలో చోరీ చేసిన పెంచలయ్యను జైలుకు పంపించాం. నెయ్యి ట్యాంకర్ కడప జిల్లాలో బోల్తా పడటంపై పలు అవమానాలు వ్యక్తమవుతున్నాయి’ అని అన్నారు.