GNTR: బీసీల అభివృద్ధికి టీడీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. గురువారం గుంటూరు నగరంలోని అరండల్పేట 12/2 లైన్లో నిర్మించిన మూడు అంతస్తుల రజక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.