MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఇశాళ వేరుశనగ అత్యధికంగా రూ.8546 పలికిందని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజ పాషా తెలిపారు. అతి తక్కువగా రూ.4000 పలికిందని సూచించారు. మొత్తానికి 1500 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్కు వచ్చిందన్నారు. మొక్కజొన్న 459 క్వింటాళ్లు వచ్చాయని వెల్లడించారు. కందులకు రూ.7,285 ధర పలికిందన్నారు.