AP: మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఛార్జిషీట్ వేశాక కూడా నిందితులను కస్టడీకి ఇవ్వొచ్చని స్పష్టం చేసిన త్రిసభ్య ధర్మాసనం.. ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అవినాష్‌ను కస్టడీకి ఇచ్చే విషయంపై ట్రయల్ కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేస్తూ, తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.